Andhra Pradesh: నూతన విద్యావిధానం ముసాయిదాను స్వాగతిస్తున్నా.. ప్రజలు వీటినే కోరుకుంటున్నారు!: వెంకయ్య నాయుడు

  • దేశంలోని సమస్యలను పిల్లలు తెలుసుకుంటారు
  • క్రాఫ్ట్స్, యోగ, సామాజిక సేవలు సిలబస్ లో చేర్చాలి
  • ట్విట్టర్ లో స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విద్యార్థుల్లో సామాజిక అవగాహనను పెంచేలా కరంట్ అఫైర్స్ ను పాఠ్య ప్రణాళికలో భాగం చేస్తూ జాతీయ నూతన విద్యావిధానంలో భాగం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. దీనివల్ల దేశంలోని ముఖ్యమైన సమస్యలు తెలుసుకునేలా సిలబస్ రూపకల్పన జరుగుతుందని వ్యాఖ్యానించారు.

పాఠ్యప్రణాళికలో మార్పులు చేసి ఆటలు, క్రాఫ్ట్స్, యోగ, సామాజిక సేవలు వంటి అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలని చాలా కాలంగా ప్రజలు కోరుకుంటున్నారని వెంకయ్య చెప్పారు. ఒత్తిడిలేని చదువుకు పెద్దపీట వేస్తూ ప్రతిపాదనలు చేయడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు వెంకయ్య ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Telangana
Venkaiah Naidu
Twitter
  • Loading...

More Telugu News