telangana bhavan: తెలంగాణ భవనం ఆవరణలో ఆవిర్భావ దినోత్సవం: పాల్గొన్న కేటీఆర్‌

  • తెలంగాణ తల్లి, జయశంకర్‌ విగ్రహాలకు నివాళులు
  • రాష్ట్ర ప్రజలకు ఇది శుభదినం
  • అరవై ఏళ్ల కల నెరవేరిన రోజు

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పాల్గొన్నారు. ఆవరణలోని తెలంగాణ  తల్లి, జయశంకర్‌ విగ్రహాలకు తొలుత ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి, తమ జీవితాలు బాగుపడాలని అరవై ఏళ్లుగా ఎదురుచూసిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు ఇదని’ ఆనందం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ సాధించుకునేందుకు అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

telangana bhavan
KTR
celebrations
  • Loading...

More Telugu News