Neymar: వరల్డ్ ఫుట్ బాల్ స్టార్ నెయ్ మార్ పై రేప్ కేసు!

  • ఇన్ స్టాగ్రామ్ లో యువతి పరిచయం
  • పారిస్ లో కలిసిన ఇద్దరూ
  • అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ ఫుట్ బాల్ స్టార్, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నెయ్ మార్ పై అత్యాచారం ఆరోపణలు నమోదయ్యాయి. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు పెట్టినట్టు సావ్ పావ్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన నెట్ మార్, పరిచయం స్నేహమైన తరువాత, పారిస్ లో కలుద్దామని చెప్పాడని, ఆపై తాను పారిస్ కు వెళ్లగా, ఓ హోటల్ లో బలవంతంగా అనుభవించాడని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోటల్ కు మత్తులో వచ్చిన నెయ్ మార్, తనపై అత్యాచారం చేశాడన్న ఆమె ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

కాగా, నెయ్ మార్ పై వచ్చిన ఆరోపణలను ఆయన తండ్రి శాంటోస్ ఖండించారు. ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేసేందుకు చేస్తున్న ఆరోపణలేనని ఆయన ఆరోపించారు. తన బిడ్డ ఎలాంటి తప్పూ చేయలేదని, యువతి ఆరోపణలపై తమ వద్ద ఉన్న సాక్ష్యాలను న్యాయవాదులకు ఇచ్చామని ఆయన అన్నారు. నెయ్ మార్, ఆ యువతి డేటింగ్ కు వెళ్లారని, ఆ తరువాత తన బిడ్డ ఆమెను కలవలేదని, నెయ్ మార్ నుంచి డబ్బు గుంజడమే ఆమె లక్ష్యమని ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ ఓ ట్రాప్ అని ఆయన అభివర్ణించారు.

కాగా, గత నెల 15 నుంచి మూడు రోజుల పాటు బాధితురాలు పారిస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నెయ్ మార్ కోపా అమెరికా ఫుట్ బాల్ పోటీల కోసం సిద్ధమవుతున్నాడు.

Neymar
Instagram
Rape
Case
Police
  • Loading...

More Telugu News