assembley: శాసనసభ, మండలి ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • అసెంబ్లీ ఆవరణలో జెండా ఆవిష్కరించిన పోచారం
  • మండలి ఆవరణలో విద్యాసాగర్‌ పతాకావిష్కరణ
  • ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పోచారం, విద్యాసాగర్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా శాసనసభ, శాసన మండలి ఆవరణలలో సభాపతులు ఈరోజు జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. శాసన సభ వద్ద స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి వద్ద డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌లు మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు పూర్తయి ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా  ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు

assembley
Pocharam Srinivas
vidyasagar
celebrations
  • Loading...

More Telugu News