Narendra Modi: మోదీతో డిన్నర్ కు వెళ్లాలనుందని సల్మాన్ కు చెప్పిన కత్రినా కైఫ్!

  • 'భారత్' సినిమా ప్రమోషన్ లో సల్మాన్, కత్రినా
  • సల్మాన్ తో ఇంతవరకూ డిన్నర్ చేయలేదన్న కత్రినా
  • తాను కుటుంబీకులతోనే తింటానన్న సల్మాన్

ప్రస్తుతం తామిద్దరమూ కలిసి నటించిన 'భారత్' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లు, ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన వేళ, కత్రినా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి డిన్నర్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పింది. "మీరు బ్ర‌తికి ఉన్న‌, లేక చ‌నిపోయిన వారిలో ఎవ‌రితో డిన్న‌ర్ చేయాల‌నుకుంటున్నారు?" అని తనకు ఎదురైన ప్ర‌శ్న‌కు "మార్లిన్ మ‌న్రో, నరేంద్ర మోదీ, కండోలిజా రైస్‌" లతో అని క‌త్రినా స‌మాధాన‌మిచ్చింది.

ఇదే సమయంలో పక్కనే ఉన్న సల్మాన్ కల్పించుకుని, ఈ జాబితాలో తాను లేనా? అని ప్రశ్నించాడు. దానికి కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన కత్రినా, తాను ఇంతవరకూ సల్మాన్ తో డిన్నర్ చేయలేదని, ఆయన ఎప్పుడూ బయట డిన్నర్ చేయకపోవడమే ఇందుకు కారణమని అంది.

ఆపై సల్మాన్ మాట్లాడుతూ, క‌త్రినా కైఫ్ తన డిన్న‌ర్ ను సాయంత్రం ఆరున్న‌ర గంట‌ల‌కే ముగించేస్తుందని, తాను ఆ సమయంలో లంచ్ చేస్తానని ఫన్నీ వ్యాఖ్యలు చేశాడు. లంచ్ అయినా, డిన్న‌ర్ అయినా కుటుంబ స‌భ్యుల‌తో కలిసి చేయడమే తనకు అలవాటని అన్నాడు.

Narendra Modi
Salman Khan
Katrina Kaif
Dinner
  • Loading...

More Telugu News