telangana day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం వేడుకలు ప్రారంభం...జాతీయ జెండా ఆవిష్కరించి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌

  • పబ్లిక్‌ గార్డెన్స్‌లో సంబరాలు
  • తొలుత గన్‌పార్క్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి
  • అమరవీరుల స్థూపం వద్ద నివాళులు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం వేడుకలు అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. పబ్లిక్‌ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలకు శ్రీకారం చుట్టారు.  తొలుత కేసీఆర్‌ గన్‌పార్క్‌కు వెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్స్‌కు చేరుకుని జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు.
 

telangana day
public gardens
KCR
gunpark
  • Loading...

More Telugu News