Jagan: గవర్నర్ సమక్షంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

  • విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు జగన్
  • ఉమ్మడి అంశాలపై భేటీలో చర్చించే అవకాశం
  • ఇఫ్తార్ విందులో పాల్గొననున్న సీఎంలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారం కోసం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేరుగా  రాజ్‌భవన్‌కు చేరుకోగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.

ఉమ్మడి రాజధానిలోని సంస్థల ఆస్తులు, ఉద్యోగుల విభజన, కార్యాలయాల అప్పగింత తదితర సమస్యలపై చర్చించనున్నారు. సమస్యలన్నింటినీ సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం రంజాన్ సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందులో సీఎంలిద్దరూ పాల్గొననున్నారు.

Jagan
KCR
Narasimhan
Vijayawada
Hyderabad
Rajbhavan
  • Loading...

More Telugu News