Vijayakumar Reddy: ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా విజయకుమార్ రెడ్డి నియామకం

  • కీలక మార్పులు చేస్తున్న జగన్
  • సీఎం అదనపు కార్యదర్శిగా ధనుంజయరెడ్డి
  • బదిలీ కానున్న వెంకటేశ్వర్

ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కీలక మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు. ముఖ్యమైన అధికారులందరికీ బదిలీలిచ్చి వారి స్థానంలో వేరొకరిని నియమిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కె. ధనుంజయరెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ఉన్న వెంకటేశ్వర్‌ ప్రస్తుతం బదిలీ కానున్నారు. ఆయన స్థానంలో విజయకుమార్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసులో ఉన్నారు.

Vijayakumar Reddy
Venkateswar
Dhanujaya Reddy
Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News