yeddyurappa: వారి మధ్యే గొడవలు వస్తాయి... మేము చూస్తూ ఉంటాం: యడ్యూరప్ప
- కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరచవద్దని హైకమాండ్ ఆదేశించింది
- రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చు
- ప్రియాంక్ ఖర్గే వల్లే ఆయన తండ్రి ఓడిపోయారు
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచవద్దంటూ తమను పార్టీ హైకమాండ్ ఆదేశించిందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప తెలిపారు. తాను ఢిల్లీ నుంచి వచ్చానని... రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల్లో జోక్యం చేసుకోవద్దని తమ నేతలు ఆదేశించారని చెప్పారు. వారి మధ్యే గొడవలు వస్తాయని... రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చని... తాము మాత్రం చూస్తూ ఉంటామని తెలిపారు.
కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో... ఆ శాఖ పేరును క్లీన్ చిట్లు ఇచ్చే శాఖగా మార్చుకోవాలంటూ ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను యడ్యూరప్ప తప్పుబట్టారు. ప్రియాంక్ వైఖరి వల్లే ఆయన తండ్రి మల్లికార్జున ఖర్గే లక్ష ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు.