kishan reddy: నేను చెప్పిన దాంట్లో తప్పేముంది?: కిషన్ రెడ్డి

  • ఉగ్రమూలాలు హైదరాబాదులో ఉన్నాయన్న వ్యాఖ్యలను సమర్థించుకున్న కిషన్ 
  • ఎక్కడ ఏమి జరిగినా హైదరాబాదుతో లింకులుంటున్నాయి
  • జరుగుతున్న విషయాన్నే నేను చెప్పాను

మన దేశంలో ఉగ్ర మూలాలు హైదరాబాదులో ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి సమర్థించుకున్నారు. తాను చెప్పిందాంట్లో తప్పేమీ లేదని అన్నారు. దేశంలో పలుచోట్ల ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయనే విషయాన్ని తాను చెప్పానని అన్నారు. భోపాల్, బెంగళూరు.. ఇలా ఉగ్ర ఘటనలు ఎక్కడ జరిగినా వాటి మూలాలు హైదరాబాదులో కనిపిస్తున్నాయని... ప్రతి రెండు, మూడు నెలలకు ఎన్ఐఏ, రాష్ట్ర పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. జరుగుతున్న విషయాన్నే తాను చెప్పానని అన్నారు.

kishan reddy
hyderabad
terrorist
  • Loading...

More Telugu News