Andhra Pradesh: తెలంగాణ బిడ్డలకు నా తరఫున, జనసేన తరఫున శుభాకాంక్షలు!: పవన్ కల్యాణ్

  • యోధుల త్యాగఫలంతో తెలంగాణ వచ్చింది
  • జూన్ 2 ఇక్కడి ప్రజల కల సాకారమైన రోజు
  • ప్రకటన విడుదల చేసిన జనసేన పార్టీ

జూన్ 2.. తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అనేక మంది యోధుల త్యాగఫలంతో తెలంగాణ ఆవిర్భవించిందని వ్యాఖ్యానించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బిడ్డలకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు పవన్ చెప్పారు.

అభివృద్ధి ఫలాలు అందరికీ అందినప్పుడే ఈ అమరులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల మాటలు నిజం కావాలని కోరుకుంటున్నట్లు జనసేనాని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ సంతకంతో కూడిన ప్రకటనను జనసేన పార్టీ రోజు విడుదల చేసింది.

Andhra Pradesh
Telangana
Jana Sena
june 2
Pawan Kalyan
  • Loading...

More Telugu News