New DGP: కొత్త డీజీపీ...పోలీస్‌ బాస్‌గా గౌతం సవాంగ్‌ బాధ్యతల స్వీకారం

  • నవ్యాంధ్రకు ఐదో డీజీపీ
  • అభినందించిన పలువురు అధికారులు
  • హెడ్‌క్వార్టర్స్‌ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ నూతన పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ)గా గౌతం సవాంగ్‌ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో బాధ్యతలు స్వీకరించిన ఐదో అధికారి ఆయన. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి విచ్చేసిన గౌతం సవాంగ్‌ తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోకి అడుగుపెట్టి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు సవాంగ్‌ను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనపై గురుతరమైన బాధ్యత ఉంచిందని, దానిని చిత్తశుద్ధితో నిర్వహిస్తానని అన్నారు. ఏపీ పోలీసులకు దేశంలోనే మంచి గుర్తింపు ఉందని, అటువంటి శాఖకు డీజీపీగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

New DGP
goutham savang
mangalagiri
  • Loading...

More Telugu News