paruchuri: అసలు విషయం పరిటాల రవి చెప్పారు: పరుచూరి గోపాలకృష్ణ
- మేము రాసిన తొలి ఫ్యాక్షన్ సినిమా 'కడప రెడ్డెమ్మ'
- ఆ సినిమా సరిగ్గా ఆడలేదు
- ఆ తరువాత అసలు సంగతి తెలిసింది
తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో, తాము రాసిన ఫ్యాక్షన్ సినిమాలను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. 'కడప రెడ్డెమ్మ' సినిమాతోనే పరుచూరి బ్రదర్స్ కలం నుంచి మొదటిసారిగా ఫ్యాక్షన్ వాసన వచ్చింది. ఈ సినిమాలో మోహన్ బాబు ఒక కులానికి చెందినవాడైతే.. శారద మరో కులానికి చెందినది. ఒక కులం అబ్బాయికి .. మరో కులం అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమకథ ఇది.
అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తరువాత పరిటాల రవి నాకు బాగా పరిచయమైన తరువాత, 'కడప రెడ్డెమ్మ'పై చాలా ఆశపెట్టుకున్నానయ్యా .. కానీ పోయింది' అని అన్నాను. 'ఎందుకుపోయిందో తెలుసా?' అన్నారాయన. 'తెలియదు' అన్నాను. 'ఈసారి గనుక ఇలాంటి కథ రాస్తే ఒకే కులంపై రాయండి' అన్నారు. దాంతో మాకు విషయం అర్థమైపోయింది. 'సమర సింహారెడ్డి' .. 'నరసింహ నాయుడు' సినిమాల విషయంలో అదే పద్ధతిని ఫాలో అయ్యాము .. అవి అద్భుత విజయాలను అందుకున్నాయి" అని చెప్పుకొచ్చారు.