Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ కు లేఖరాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ!

  • జగన్ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి
  • జూన్ 13న సమ్మెను నివారించాలి
  • ఆర్టీసీకి రూ.3,700 కోట్లను కేటాయించాలని వినతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఈరోజు బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు, జేఏసీతో చర్చలు జరిపి సమ్మెను నివారించాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతం ఆర్టీసీ అప్పులు రూ.6,263 కోట్లకు చేరుకున్నాయనీ తెలిపారు. ఆర్టీసీకి 2019-20 బడ్జెట్ లో రూ.3,700 కోట్లు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న సాకుతో సిబ్బందిని కుదించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ పాలకమండలిలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించి జూన్ 13న జరిగే సమ్మెను నివారించాలని మరోసారి కోరారు. ఆర్టీసీలో ఇప్పటికైనా ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని సూచించారు.

Andhra Pradesh
Jagan
Chief Minister
CPI
RAMAKRISHNA
OPEN LETTER
  • Loading...

More Telugu News