nalgondaMP: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • ఈ నెల 3న లేఖ అందించే అవకాశం
  • నల్గొండ నుంచి ఎంపీగా గెలుపొందడంతో నిర్ణయం
  • గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్‌నగర్‌ నుంచి గెలుపు

ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 3వ తేదీన ఆయన తన రాజీనామా లేఖ అందించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుగా జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉత్తమ్‌ విజయాన్ని దక్కించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పదవి వదులుకోవాలని నిర్ణయించారు. ఉత్తమ్‌ రాజీనామా చేస్తే ఆరు నెలల్లోగా హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

nalgondaMP
hujurnagar MLA
Uttam Kumar Reddy
regignation
  • Loading...

More Telugu News