Andhra Pradesh: సీఎం జగన్ దుబారా ఖర్చును కట్టడి చేశారు.. ఇకపై హిమాలయ వాటర్ బాటిళ్లు కనిపించవు!: విజయసాయిరెడ్డి

  • ప్రతీ రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుంది
  • చంద్రబాబు ప్రభుత్వం విలాసాలను వదులుకోలేదు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ సీనియర్ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో దుబారా ఖర్చులను కట్టడి చేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రమాణస్వీకారం సమయంలోనే ఈ విషయం స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతీరూపాయికి జవాబుదారీతనం ఉంటుందని స్పష్టం చేశారు.

ఇకపై రాష్ట్ర ప్రభుత్వ సమావేశాల్లో ఖరీదైన హిమాలయ వాటర్ బాటిళ్లు కనిపించవని ఏపీ మాజీ సీఎం చంద్రబాబును పరోక్షంగా విమర్శించారు. ఏపీ అప్పుల్లో కూరుకుపోయినా చంద్రబాబు ప్రభుత్వం విలాసాలను మాత్రం వదులుకోలేదని దుయ్యబట్టారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘దుబారా ఖర్చులను సిఎం జగన్ గారు కట్టడి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రతి రూపాయి వ్యయానికి అకౌంటబులిటీ ఉంటుంది. హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవిక. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదు’ అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News