Andhra Pradesh: కృష్ణా జిల్లాలో కావేరీ బస్సుకు బ్రేకులు ఫెయిల్.. ప్రాణభయంతో వణికిపోయిన ప్రయాణికులు!

  • ఆచంట నుంచి హైదరాబాద్ కు సర్వీసు
  • అనాసాగరం వద్దకు రాగానే ప్రమాదం
  • మరో బస్సులో ప్రయాణికుల తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో ఈరోజు పెను ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరిలోని ఆచంట నుంచి హైదరాబాద్ కు వెళుతున్న కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఈరోజు ఉదయం కృష్ణాజిల్లాలోని అనాసాగరం వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు డ్రైవర్ తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని సమాచారం. మరోవైపు బస్సు డివైడర్ పై ఇరుక్కుపోవడంతో ప్రయాణికుల కోసం మరో వాహనాన్ని కావేరీ యాజమాన్యం ఏర్పాటు చేసింది.

Andhra Pradesh
Telangana
kaveri tyravels
break fail
Road Accident
  • Loading...

More Telugu News