Ram madhav: ఢిల్లీలో రాంమాధవ్‌ను కలిసిన తెలంగాణ సీనియర్ టీడీపీ నేతలు.. జంప్ అంటూ ప్రచారం

  • రాం మాధవ్‌ను కలిసిన పెద్దిరెడ్డి, సురేశ్ రెడ్డి
  • బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం
  • అభినందించేందుకే వచ్చామన్న టీటీడీపీ నేతలు

తెలంగాణ టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, చాడా సురేశ్ రెడ్డి కలిసి ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోకి వలసలు ఉండబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ నేతలు రాం మాధవ్‌ను కలవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి.

త్వరలోనే వీరు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వీరివెంట బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఉండడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో స్పందించిన పెద్దిరెడ్డి ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. రాంమాధవ్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు అభినందనలు చెప్పేందుకే కలిశామని  వివరణ ఇచ్చారు.

Ram madhav
Telangana Telugudesam
Peddireddy
Suresh reddy
BJP
  • Loading...

More Telugu News