Vivek: కార్యకర్త పుట్టినరోజును దగ్గరుండి నిర్వహించిన ఢిల్లీ సీఎం.. ఫొటోలు వైరల్

  • కార్యకర్తతో దగ్గరుండి కేక్ కట్ చేయించిన కేజ్రీవాల్ 
  • తనకు లభించిన అరుదైన గౌరవం అంటూ ట్వీట్
  • పార్టీ కార్యకర్తలే తమకున్న గొప్ప బలమన్న ముఖ్యమంత్రి 

ఓ కార్యకర్త పుట్టిన రోజు వేడుకను ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరుండి నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఈ అరుదైన ఘటనకు ఢిల్లీ వేదికగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రస్తుతం ఈ ఘటన ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, 'ఆప్' సోషల్ మీడియా టీం మెంబర్ వివేక్ పుట్టిన రోజు సందర్భంగా దగ్గరుండి అతనితో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వివేక్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

 ‘ఓ సాధారణ కార్యకర్తకు ఓ ముఖ్యమంత్రి నుంచి లభించిన అరుదైన గౌరవం’ అంటూ వివేక్ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్, ఫోటోలు వైరల్ అవడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీనిపై స్పందించిన కేజ్రీ, పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలే తమకున్న గొప్ప బలమని, కార్యకర్తల సాయంతోనే తమ పార్టీ దేశ సేవ చేస్తోందని వ్యాఖ్యానించారు.

Vivek
Aravind Kejriwal
Delhi
Social Media
Twitter
Birth day
Cake
  • Loading...

More Telugu News