kcr: జగదీశ్ రెడ్డి బీచ్ లలో తిరుగుతున్నారు.. కేసీఆర్ పతనం ప్రారంభమైంది: కోమటిరెడ్డి

  • ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకున్న రోజే కేసీఆర్ పతనం ప్రారంభమైంది
  • రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత కేసీఆర్ కుటుంబానిదే
  • కేసీఆర్ ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోము

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు మళ్లీ పరాభవం ఎదురుకానుందని అన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలు ఉండకూడదని భావించిన రోజే కేసీఆర్ పతనం మొదలైందని చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి దివాలా తీయించడం, అప్పులపాలు చేయడం వంటి ఘనతలు కేసీఆర్ కుటుంబానికే చెందుతాయని అన్నారు. కేసీఆర్ ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోమని తెలిపారు. ఇంటర్ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేని మంత్రి జగదీశ్ రెడ్డి... బీచ్ లలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

kcr
jagadish reddy
TRS
komatireddy rajagopal reddy
congress
  • Loading...

More Telugu News