union cabinet: కేంద్ర కేబినెట్ మంత్రులకు పోర్ట్ ఫోలియోలు ఖరారు.. ఎవరెవరికి ఏయే శాఖలంటే?
- అమిత్ షాకు హోం శాఖ
- రాజ్ నాథ్ కు రక్షణ శాఖ
- జయశంకర్ కు విదేశాంగ శాఖ
నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం నిన్న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కొత్త కేంద్ర కేబినెట్ మంత్రులకు కాసేపటి క్రితం శాఖలను కేటాయించారు. ఎవరెవరికి ఏయే శాఖలు దక్కాయంటే...
- నరేంద్ర మోదీ: ప్రధానమంత్రి. దీంతో పాటు అటామిక్ ఎనర్జీ, స్పేస్, ప్రజా ఫిర్యాదులు ఇతరులకు కేటాయించని అన్ని శాఖలు.
- రాజ్ నాథ్ సింగ్: రక్షణ శాఖ
- అమిత్ షా: హోం శాఖ
- నిర్మాలా సీతారామన్: ఆర్థిక శాఖ
- ఎస్.జయశంకర్: విదేశాంగ శాఖ
- నితిన్ గడ్కరీ: జాతీయ రహదారులు మరియు రోడ్డు రవాణా, చిన్న మధ్య తరగతి పరిశ్రమలు
- రాంవిలాస్ పాశ్వాన్: వాణిజ్య శాఖ, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ
- నరేంద్ర సింగ్ తోమార్: వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ
- రవిశంకర్ ప్రసాద్: న్యాయ శాఖ, సమాచార శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ
- హర్ సిమ్రత్ కౌర్ బాదల్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ
- తావర్ చంద్ గెహ్లాట్: సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్ మెంట్ శాఖ
- రమేష్ పోఖ్రియల్ నిశాంక్: మానవ వనరుల శాఖ
- స్మృతి ఇరానీ: మహిళా శిశు సంక్షేమ శాఖ, టెక్స్ టైల్స్ శాఖ
- హర్షవర్ధన్: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, ఎర్త్ సైన్సెస్ శాఖ
- ప్రకాశ్ జవదేకర్: పర్యావరణం, అడవుల శాఖ, సమాచార ప్రసార శాఖ
- పియూష్ గోయల్: రైల్వే శాఖ, పరిశ్రమల శాఖ
- ధర్మేంద్ర ప్రదాన్: పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ, ఉక్కు శాఖ
- ప్రహ్లాద్ జోషి: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు శాఖ, గనుల శాఖ
- మహేంద్రనాథ్ పాండే: స్కిల్ డెవలప్ మెంట్ మరియు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ శాఖ
- ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి: మైనారిటీ వ్యవహారాల శాఖ
- సదానందగౌడ: కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ శాఖ
- గజేంద్రసింగ్ షెకావత్: జలశక్తి శాఖ
- అరవింద్ గణపత్ సావంత్: భారీ పరిశ్రమలు
- గిరిరాజ్ సింగ్: డైరీ, మత్స్య, యానిమల్ హస్బెండరీ శాఖ