Crime News: పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య : సంగారెడ్డి జిల్లాలో ఘటన

  • జాతీయ రహదారిపై కత్తులతో నరికి చంపిన దుండగులు
  • హతుడిని మహబూబ్‌గా గుర్తింపు
  • ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు

పట్టపగలు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఉన్న సమయం, అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన  గుర్తుతెలియని వ్యక్తులు  సదరు వ్యక్తిని కత్తులతో నరికి చంపి తాపీగా వెళ్లిపోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.

హతుడిని మహబూబ్‌గా గుర్తించారు. సంఘటన సమయంలో హైవేపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. అయినా ఏ వాహన చోదకుడూ నిందితులను ఆపే సాహసం చేయలేకపోయారు. దీంతో దుండగులు వచ్చిన పని పూర్తి చేసుకుని తాపీగా వెళ్లిపోయారు. ఘటనకు కారణాలు తెలియరాలేదు. హతుడు హైదరాబాద్‌లోని ముషీరాబాద్ వాసి అని, ఇతనికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని పోలీసులు చెప్పారు. గతంలో లక్డారం దగ్గర జరిగిన ఓ హత్య కేసులో మహబూబ్‌ ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు.

Crime News
man murder
Sangareddy District
patancheru
  • Loading...

More Telugu News