america: అమెరికా అధ్యక్ష భవనం సమీపంలో ప్రవాస భారతీయుని ఆత్మహత్య

  • అందరూ చూస్తుండగానే నిప్పంటించుకుని ఆత్మహత్య
  • మృతుడు భారత్‌కు చెందిన ఆర్నవ్‌ గుప్తాగా గుర్తింపు
  • ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు

అమెరికా దేశాధ్యక్షుడి నివాసం వైట్‌హౌస్‌ సమీపంలో ప్రవాస భారతీయుడు ఒకరు సజీవదహనం కావడం సంచలనమైంది. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని తనకు తాను నిప్పంటించుకోవడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మృతుడిని భారత్‌కు చెందిన ఆర్నవ్‌గుప్తాగా గుర్తించారు.

అమెరికాలోని మేరీల్యాండ్‌లో నివసిస్తున్న ఆర్నవ్‌గుప్తా బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకువచ్చాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆర్నవ్‌ శ్వేతసౌధానికి సమీపంలో ఉన్న ఎలిప్స్‌ పార్క్‌కు వచ్చాడు. అక్కడ అంతా చూస్తుండగానే ఈ దుర్ఘటనకు ఒడిగట్డాడు. దీంతో షాక్‌ తిన్న స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ శరీరం బాగా కాలిపోవడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆర్నవ్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

america
whitehouse
NRI suicide
  • Loading...

More Telugu News