allari naresh: నేను ఎదురైనప్పుడల్లా ప్రభాస్ ఆ మాట చెప్పేసి నవ్వేస్తుంటాడు: 'అల్లరి' నరేశ్

  • నా సినిమాల్లో స్పూఫ్ లు ఎక్కువ
  • ఎవరినీ కించపరడం జరగదు
  •  నేను అలా చేయడం ప్రభాస్ కి నచ్చింది  

తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా 'అల్లరి' నరేశ్ ఒక రేంజ్ లో సందడి చేస్తుంటాడు. హాస్య కథానాయకుడిగా చాలా వేగంగా 50 సినిమాలను పూర్తిచేసిన ఘనత ఆయన సొంతం. తన సినిమాల్లో ఆయన స్పూఫ్ లను ఎక్కువగా చేస్తుంటాడు. కాకపోతే అవి ఏ హీరోలను కించపరిచేలా వుండవు.

'దొంగల బండి' సినిమాలో తన లవర్ ముచ్చట తీర్చడం కోసం ఆయన 6 సిగరెట్ ప్యాకెట్లు పెట్టేసుకుని సిక్స్ ప్యాక్ అంటూ సందడి చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నేను ఎక్కడ ఎదురుపడినా ప్రభాస్ ఈ సీన్ గురించి ప్రస్తావిస్తాడు. 'ఫ్యాన్స్ కోసం మేము 6 .. 7 నెలల పాటు కష్టపడి సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటే, సిగరెట్ ప్యాకెట్లతో నువ్వు నీ ఫ్యాన్స్ ను మెప్పించేస్తావా? మేము ఎంతో కష్టపడి చేసిన సీన్స్ ను నువ్వు ఇంత తేలికగా చేసేస్తున్నావేంట్రా బాబూ' అంటూ నవ్వేస్తుంటాడు అని చెప్పుకొచ్చాడు.

allari naresh
prabhas
  • Loading...

More Telugu News