Ranga Reddy District: పులి బారి నుంచి కాపాడమంటున్న ప్రజలు!

  • మైసగండి ప్రాంతంలో పులి సంచారం
  • ఆవు, మూడు దూడలపై దాడి
  • అటవీ శాఖ స్పందించాలంటున్న గ్రామస్థులు

రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం మైసగండి ప్రాంతంలో ఓ పులి సంచరిస్తుండటం ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది. వ్యవసాయ పొలాల్లోకి వచ్చిన పులి, అక్కడ నివసించేవారి పశు సంపదపై దాడులకు దిగుతోంది. ఇప్పటికే ఓ ఆవును, మూడు దూడలపై దాడి చేసి, వాటిని చంపింది. పులి తిరుగుతూ ఉండటంపై ఆందోళన చెందుతున్న మైసగండి వాసులు, వెంటనే అటవీ శాఖాధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఇది మనుషులపై దాడి చేయకముందే దాని బారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.

Ranga Reddy District
Tiger
Kadtal
Cow
  • Loading...

More Telugu News