vinod: వాళ్లల్లో అత్యధికులు బీజేపీకి ఓటు వేశారు: టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్

  • బీజేపీ గెలుపుకు జాతీయవాదమే కారణమనిపిస్తోంది
  • ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం
  • కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు సాధించడానికి కృషి చేశా

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు జాతీయవాదమే కారణమనిపిస్తోందని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఒకే రకమైన జాతీయభావన కనిపిస్తోందని చెప్పారు. పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం బీజేపీకి అనుకూల ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారిలో అత్యధికులు బీజేపీకి ఓటు వేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని... ప్రజల తీర్పుకు కట్టుబడి ఉండాలని అన్నారు.

తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ కు స్మార్ట్ సిటీని తీసుకొచ్చానని వినోద్ తెలిపారు. స్మార్ట్ సిటీ హోదా వల్ల ఐదేళ్లలో కరీంనగర్ కు రూ. 1000 కోట్ల నిధులు వస్తాయిని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు సాధించడానికి కృషి చేశానని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో వినోద్ ఓటమిపాలయ్యారు.

  • Loading...

More Telugu News