shiva: ముందుగా రజనీ కథపైనే కసరత్తు చేస్తున్నాడట

  • శివ నుంచి వరుస సినిమాలు 
  • అజిత్ హీరోగా వరుస విజయాలు 
  • రజనీ మూవీ తరువాతే సూర్య ప్రాజెక్టు 

తమిళ అగ్రదర్శకులలో శివ ఒకరుగా కొనసాగుతున్నాడు. కొంతకాలంగా ఆయన అజిత్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన హీరో సూర్యతో ఒక సినిమాను ప్లాన్ చేశాడు. అయితే ఈ లోగా ఆయనకి రజనీకాంత్ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.

సూర్యతో సినిమా తరువాత అయినా చేసుకోవచ్చు. రజనీ నుంచి మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని భావించిన శివ, రజనీ ప్రాజెక్టుకే ప్రాధాన్యతనిచ్చాడట. సూర్యని రిక్వెస్ట్ చేసే ఆయన రజనీ ప్రాజెక్టుకి వెళ్లాడని అంటున్నారు. ప్రస్తుతం ఆయన రజనీ సినిమాకి సంబంధించిన కథపై కసరత్తు చేస్తున్నాడు. మురుగదాస్ సినిమా పూర్తికాగానే, శివతో కలిసి రజనీ సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు. 

shiva
rajani
surya
  • Loading...

More Telugu News