Baba Ramdev: మీకు 'కపాల భారతి' కావాల్సిందే: విపక్షాలకు రామ్ దేవ్ బాబా సలహా

  • వచ్చే పది, పదిహేనేళ్లు మోదీయే ప్రధాని
  • విపక్షాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాయి
  • తట్టుకునేందుకు వినూత్న యోగాసనాలు చెప్పిన రామ్ దేవ్

రానున్న 10 నుంచి 15 సంవత్సరాల పాటు నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉంటారని, విపక్ష నేతలు తమలోని ఒత్తిడిని అధిగమించేందుకు 'కపాల భారతి'ని సాధన చేయాలని యోగా గురు బాబా రామ్ దేవ్ సలహా ఇచ్చారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఘన విజయం సాధించగా, దేశానికి రెండోసారి పీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

ప్రతిపక్ష నేతలంతా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని అభిప్రాయపడ్డ రామ్ దేవ్, దాన్ని అధిగమించేందుకు 'కపాల భారతి', 'అనులోమ్ విలోమ్' సాధన ఒక్కటే మార్గమని అన్నారు. మోదీ నేతృత్వంలో ఇండియా మరింత పురోభివృద్ధి సాధించనుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీలు రానున్న ఐదేళ్లూ శ్రమించి పనిచేయాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన కోరారు.

Baba Ramdev
Yoga
Kapala Bharati
Narendra Modi
  • Loading...

More Telugu News