Chandrababu: ఇదిగో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్... బెజవాడలో వెలిసిన ప్లెక్సీ!

  • చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్
  • అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి
  • గేట్ వే హోటల్ పక్కనే ఆసక్తికర ప్లెక్సీ

"చంద్రబాబుకు కచ్చితంగా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా"... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, విజయవాడలో 'రిటర్న్ గిఫ్ట్' అంటూ ఓ ప్లెక్సీ వెలిసింది. నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ లతో పాటు తెలుగురాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బస చేసిన విజయవాడలోని గేట్ వే హోటల్ కు పక్కనే ఈ ప్లెక్సీని ఏర్పాటు చేయడం గమనార్హం. జగన్ కు కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇస్తున్న ఫోటోతో పాటు "థ్యాంక్స్ కేసీఆర్ గారు... ఫర్ రిటర్న్ గిఫ్ట్" అని ఉంది. చిరంజీవి అనే స్థానిక నేత ఒకరు దీన్ని ఏర్పాటు చేశారు.

Chandrababu
KCR
Return Gift
Jagan
Vijayawada
  • Loading...

More Telugu News