Andhra Pradesh: ఏపీ డీజీపీగా గౌతం సవాంగ్‌కు పూర్తి బాధ్యతల అప్పగింత!

  • పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన 
  • ఆర్పీ ఠాకూర్, ఏబీ వెంకటేశ్వరరావులకు స్థాన చలనం
  • విశ్వజిత్‌కు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా గౌతం సవాంగ్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే  విజిలెన్స్ డీజీగా ఉన్న సవాంగ్‌కు డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో ఇప్పటి వరకు సేవలు అందించిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించారు. ఆ స్థానంలో ఉన్న ఉన్న త్రిపాఠీని జేఏడీకి బదిలీ చేశారు. అలాగే, జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ ఏసీబీ  డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్‌ ఏడీజీ కుమార్‌ విశ్వజిత్‌కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh
Jagan
gautam sawang
police
  • Loading...

More Telugu News