Congress: మణిపూర్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. 12 మంది ఎమ్మెల్యేల రాజీనామా
- ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్
- రాష్ట్రంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా
- రాజీనామా చేసిన వారందరూ బీజేపీలో చేరుతారని ప్రచారం
మణిపూర్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరందరూ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు స్థానాల్లో ఒక దానిని బీజేపీ గెల్చుకోగా, రెండో దానిని నాగా పీపుల్స్ ఫ్రంట్ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వీరంతా పార్టీకి రాజీనామా చేశారు.
సీడబ్ల్యూసీ సభ్యుడు, పీసీసీ చీఫ్ గయ్‌ఖంగంకు తమ రాజీనామా పత్రాలను అందించారు. కాగా, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపై సీనియర్ నేత ఒకరు స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేసి కార్యకర్తల్లో పార్టీపై నమ్మకం పెంచేందుకే తాము రాజీనామా చేసినట్టు తెలిపారు.