Saklen Ali: వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని పరామర్శించి.. రూ.50 వేలు సాయం అందించిన రేవంత్!

  • వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు
  • రెండు రోజులుగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స
  • మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు రేవంత్ సూచన

వీధి కుక్కల దాడిలో హైదరాబాదు, మౌలాలికి చెందిన సక్లెన్ అలీ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గత రెండు రోజులుగా సక్లెన్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. నేడు ఆ బాలుడిని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడి కుటుంబానికి రూ.50 వేలను సాయంగా అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, వీధి కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ పట్టనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు రేవంత్ సూచించారు.

Saklen Ali
Gandhi Hospital
Revanth Reddy
Moulali
Doctors
  • Loading...

More Telugu News