Ramanaidu: తుది శ్వాస వరకూ టీడీపీలోనే కొనసాగుతా: పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు

  • పార్టీ మారతారన్న వార్తలను ఖండించిన ఎమ్మెల్యే
  • ప్రజా సేవకు పదవులు అక్కర్లేదని వెల్లడి
  • సంకల్పం ఉంటే చాలని స్పష్టం

ప్రజా సేవకు పదవులు అక్కర్లేదని, సంకల్పం ఉంటే చాలని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తుదిశ్వాస వరకూ పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. వీరిలో రామానాయుడు పేరు కూడా బాగా వినిపిస్తుండటంతో ఆయన మీడియా ఎదుట ఆ వార్తలను ఖండించారు.

Ramanaidu
Telugudesam
Palakollu
YSRCP
  • Loading...

More Telugu News