Harshitha: ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య!

  • కొరియర్ బాయ్‌గా పని చేస్తున్న రమేష్
  • పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న హర్షిత, రమేష్
  • పెళ్లికి అంగీకరించని ఇరువైపుల పెద్దలు

ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాదులోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో హర్షిత అనే యువతి తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఇంటర్ పూర్తి చేసిన ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటోంది. జగద్గిరిగుట్టకు చెందిన రమేష్ కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు రమేష్ ఫతేనగర్‌లో ఉంటున్న తన మేనమామ ఇంటికి వస్తూ పోతుండేవాడు.

ఈ క్రమంలోనే తన మేనమామ ఇంటికి ఎదురింట్లో ఉండే హర్షితతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇరు వైపుల పెద్దలకు విషయం చెప్పగా వారు ససేమిరా అన్నారు. దీంతో హర్షిత ఆత్మహత్యాయత్నం చేసింది. రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హర్షిత మృతి చెందింది. హర్షిత మరణవార్తను విని జీర్ణించుకోలేకపోయిన రమేష్ కూడా ఫతేనగర్‌లోని ఓ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Harshitha
Ramesh
Suicide
Courier Boy
Jagadgiri Gutta
  • Loading...

More Telugu News