Jagan: సీఎం జగన్ ను ప్రశంసల వర్షంలో ముంచెత్తిన శివసేన

  • 'విజయ వీరుడు' అంటూ అభివర్ణన
  • పార్టీ పత్రికలో జగన్ ప్రస్తావన
  • జగన్ పై ప్రశంసలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ పై శివసేన పార్టీ ప్రశంసల వర్షం కురిపించింది. 'జగన్ విజయ వీరుడు' అంటూ ఆకాశానికెత్తేసింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం రాశారు. అందులో ప్రముఖంగా జగన్ గురించే ప్రస్తావించారు.

ఎన్నికల్లో ప్రత్యర్థి రాజకీయ పక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారని శివసేన అభినందించింది. అంతేకాకుండా, ఎన్నికల్లో నెగ్గిన వెంటనే మోదీతో భేటీ అవడమే గాకుండా, తన రాష్ట్రం కోసం అనేక డిమాండ్లను మోదీ ముందుంచారని పేర్కొంది. ఇక, లోక్ సభ ఎన్నికల్లో కూడా జగన్ పార్టీ ఘనవిజయం సాధించడాన్ని, అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ దారుణంగా ఓడిన వైనాన్ని సామ్నా సంపాదకీయంలో వివరించారు.

Jagan
Shivsena
BJP
Narendra Modi
YSRCP
  • Loading...

More Telugu News