jagan: ఆంధ్రప్రదేశ్‌ను జగన్ అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తారని ఆకాంక్షిస్తున్నా: రాష్ట్రపతి కోవింద్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-5be467dd344b87f8081b0505aaf27c532fb8b77b.jpg)
- ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
- వెల్లువెత్తుతున్న అభినందనలు
- జగన్‌కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన కోవింద్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వైఎస్ జగన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది సేపటి క్రితం రాష్ట్రపతి తన అధికారిక ట్విట్టర్ ద్వారా జగన్‌ను అభినందించారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత శిఖరాలకు జగన్ చేరుస్తారని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఇప్పటికే జగన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభినందనలు కూడా అందుకున్నారు.