Andhra Pradesh: ఏపీలో బదిలీలు షురూ.. నలుగురు సీనియర్ ఐఏఎస్ లపై బదిలీ వేటు!

  • సీఎంవో స్పెషల్ సీఎస్ సతీష్ చంద్రపై వేటు
  • సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని ఆదేశం
  • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అధికారుల స్థానాలు చకచకా మారిపోతున్నాయి. తాజాగా ఏపీ సచివాలయంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. గత సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్రతో పాటు ముఖ్య కార‍్యదర్శి సాయి ప్రసాద్‌, సీఎం కార్యదర్శులు గిరిజా శంకర్‌, రాజమౌళిలను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం సీఎం కార్యాలయం అదనపు కార్యదర్శిగా కె.ధనుంజయ్ రెడ్డిని నియమించారు.

Andhra Pradesh
YSRCP
Jagan
4 ias
transfer
  • Loading...

More Telugu News