jagga reddy: హరీశ్ రావును మరోసారి టార్గెట్ చేసిన జగ్గారెడ్డి

  • సింగూరు నీటిని ఇతర జిల్లాలకు తరలించారు
  • హరీశ్ వల్లే నియోజకవర్గంలో నీటి ఎద్దడి ఏర్పడింది
  • ఎమ్మెల్యే కాకపోవడం వల్ల అప్పట్లో నేను అడ్డుకోలేకపోయా

టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో సింగూరు నీటిని ఇతర జిల్లాలకు తరలించారని... దానివల్లే సంగారెడ్డి నియోజకవర్గంలో నీటి ఎద్దడి ఏర్పడిందని మండిపడ్డారు. నీటి తరలింపు విషయంలో తాను ఆనాడే పోరాడానని... కానీ, అప్పుడు ఎమ్మెల్యే కాకపోవడం వల్ల తాను అడ్డుకోలేకపోయానని అన్నారు. నీటి ఎద్దడి విషయంలో ప్రజలు తనను అపార్థం చేసుకోవద్దని కోరారు. సంగారెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొస్తామని ఎంపీ హోదాలో ప్రభాకర్ రెడ్డి ప్రకటించారని... ఇచ్చిన మాట మేరకు కృషి చేయాలని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి నీటిని తెచ్చిన తర్వాతే ప్రభుత్వ పెద్దలు మళ్లీ ఓట్లు అడగాలని చెప్పారు.

jagga reddy
harish rao
sangareddy
singuru
TRS
congress
  • Loading...

More Telugu News