veerabhdram: 'భాయ్' సినిమా బాగా నిరాశ పరిచింది: దర్శకుడు వీరభద్రం
- నాగ్ తో సినిమా చేసే ఛాన్స్ రావడం అదృష్టం
- విడుదలకి ముందు సినిమా చూశాము
- ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది
తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ, "నా కెరియర్ మొదలైన తరువాత నాకు బాధ కలిగించిన సంఘటన ఏదైనా వుందీ అంటే, అదీ 'భాయ్' సినిమా పరాజయంపాలు కావడమే. నాగార్జునతో సినిమా చేసే అవకాశం రావడం అంత తేలిక కాదు.
నా అదృష్టం కోద్దీ నాకు ఆ అవకాశం వెంటనే వచ్చింది. విడుదలకి ముందు కూడా మేమంతా కలిసి ఈ సినిమాను చూశాము. అంతా బాగుందనే అనుకున్నాము. విడుదలైన తరువాత ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా ఆడకపోవడమనేది నాకు చాలా బాధ కలిగించింది. విడుదలైన సమయం సరైనది కాకపోవడమేనని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమాకి టీవీలో మంచి రేటింగ్స్ వస్తున్నాయి" అని చెప్పుకొచ్చారు.