Andhra Pradesh: టీడీపీపై ఉన్న కసిని ప్రజలు ఓట్ల రూపంలో తీర్చుకున్నారు!: మేకపాటి రాజమోహన్ రెడ్డి

  • జగన్ గొప్పపాలన అందిస్తారన్న విశ్వాసముంది
  • మళ్లీ రాజన్న రాజ్యాన్ని ప్రజలు కోరుకున్నారు
  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన నేత

ఏపీ ప్రజలు టీడీపీ రాక్షసపాలనకు చరమగీతం పాడారని వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. టీడీపీపై ఉన్న కసిని ప్రజలు ఓట్ల రూపంలో తీర్చుకున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ గొప్ప పరిపాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

మళ్లీ రాజన్న రాజ్యం రావాలని కోరుకున్న ప్రజలు జగన్ కు పట్టం కట్టారని పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ ప్రమాణస్వీకార వేదిక వద్ద ఈరోజు మేకపాటి మీడియాతో మాట్లాడారు. పదేళ్లపాటు జగన్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని మేకపాటి అన్నారు. జగన్ లో గొప్ప నాయకుడిని ప్రజలు చూశారు కాబట్టే అఖండ విజయాన్ని కట్టబెట్టారని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Telugudesam
mekapati
rajamohan reddy
YSRCP
Jagan
  • Loading...

More Telugu News