Jagan: కళకళలాడుతున్న వేదిక... వచ్చేసిన కేసీఆర్, స్టాలిన్!

  • స్టేడియానికి చేరుకున్న కేసీఆర్, స్టాలిన్
  • అప్పటికే వచ్చి వారికి స్వాగతం పలికిన విజయమ్మ, షర్మిల
  • 'జగన్... జగన్' నినాదాలతో మారుమోగుతున్న స్టేడియం

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించేందుకు వచ్చిన వీఐపీలతో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం కళకళలాడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తలసాని తదితరులతో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ వేదికను చేరుకోగా, సభాస్థలిపైనే వారికి సీట్లను ఏర్పాటు చేశారు.

అంతకు కొద్దిసేపటి ముందే వైఎస్ జగన్ భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలతో పాటు బ్రదర్ అనిల్ కుమార్, జగన్ కుమార్తెలు హర్ష, వర్ష, టీఆర్ఎస్ నేతలు కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు వచ్చి తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. ముఖ్య అతిథులకు విజయమ్మ, షర్మిల ఆహ్వానం పలికి ఆప్యాయంగా పలకరించారు. విజయమ్మ, షర్మిల ప్రజలకు అభివాదం చేసిన సమయంలో స్టేడియం యావత్తూ "జగన్... జగన్..." నినాదాలతో మారుమోగింది.

Jagan
Oath
YS Vijayamma
KCR
Stalin
Talasani
Bharati
Sharmila
  • Loading...

More Telugu News