Jagan: గంటా, అచ్చెన్నాయుడు, పయ్యావులకు అపాయింట్ మెంట్ ఇవ్వని జగన్!

  • జగన్ అపాయింట్ మెంట్ కోరిన మాజీ మంత్రులు
  • సమయాభావం వల్ల ఇవ్వలేకపోతున్నాం
  • స్పష్టం చేసిన జగన్ కార్యాలయం అధికారులు

మరికాసేపట్లో జరిగే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కారాదని నిర్ణయించుకున్న మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ తరఫున మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్,, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ లను పంపించాలని, అది కూడా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియానికి కాకుండా, ఇంటికి వెళ్లి అభినందించి రావాలని సూచించారు.

చంద్రబాబు సూచనలతో వీరు ముగ్గురూ జగన్ అపాయింట్ మెంట్ కోరగా, అది లభించలేదు. ఈ ఉదయం నుంచి జగన్ చాలా బిజీగా ఉన్నారని, సమయాభావం వల్ల ఎవరినీ కలవలేదని, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు సైతం నేరుగా స్టేడియం వద్దకే వెళ్లారని జగన్ కార్యాలయ వర్గాలు వారికి స్పష్టం చేసినట్టు తెలిసింది. వీరు కూడా స్టేడియం వద్దకు వెళ్లి జగన్ ను కలవవచ్చని వారు స్పష్టం చేసినట్టు సమాచారం.

Jagan
Ganta Srinivasa Rao
Payyavula Keshav
Kinjarapu Acchamnaidu
  • Loading...

More Telugu News