Vijayawada: అభిమాన సంద్రమైన విజయవాడ...జగన్‌ ప్రమాణ స్వీకారానికి భారీగా జనం

  • మున్సిపల్‌ స్టేడియంలో జన సందోహం
  • తరలివచ్చిన అభిమానులు, వైసీపీ శ్రేణులు
  • నగరంలో తీవ్ర రద్దీ

అభిమాన నేత ప్రమాణ స్వీకారోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు, వైసీపీ శ్రేణులతో విజయవాడ నగరం అభిమాన సంద్రమయింది. ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్న మున్సిపల్‌ స్టేడియం జనంతో నిండిపోయింది. ఈరోజు మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్‌ నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలి రావడంతో నగరంలో రద్దీ నెలకొంది. దీంతో బందర్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బెంజి సర్కిల్‌ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూం వరకు పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలిస్తున్నారు. నగర వ్యాప్తంగా 14 చోట్ల ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేశారు. ప్రమాణ స్వీకారోత్సవం లైవ్‌ను వీటిలో తిలకించేందుకు భారీగా జనం గుమిగూడి ఉన్నారు.

Vijayawada
jagan mohanreddy
sworn
fans
  • Loading...

More Telugu News