jagan: ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాలని జగన్ తొలి నిర్ణయం!

  • కీలక నిర్ణయం తీసుకున్న జగన్
  • గతంలో ఒక్క రూపాయి జీతాన్ని తీసుకున్న ఎన్టీఆర్
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జగన్ నిర్ణయం

కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ కీలకమైన ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ముఖ్యంగా నెలకు ఒక్క రూపాయి జీతం మాత్రమే తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో దివంగత ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా నెలకు ఒక్క రూపాయి జీతాన్ని మాత్రమే తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి జీతం నెలకు రూ. 2.5 లక్షలు. ఇతర అలవెన్సులు అన్నీ కలిపితే 4 నుంచి 5 లక్షల వరకు వస్తుంది.

jagan
salary
ysrcp
  • Loading...

More Telugu News