MK Stalin: విజయవాడకు చేరుకున్న డీఎంకే అధినేత... స్వాగతం పలికిన చెవిరెడ్డి!

  • గన్నవరం చేరుకున్న స్టాలిన్
  • 12 గంటల ప్రాంతంలో స్టేడియానికి
  • పుదుచ్చేరి తరఫున వచ్చిన మల్లాడి కృష్ణారావు

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే నిమిత్తం తమిళ యువనేత, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. స్టాలిన్ కు చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ఓ హోటల్ కు వెళ్లి కాసేపు సేదదీరనున్న స్టాలిన్, ఆపై 12 గంటల ప్రాంతంలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంకు చేరుకోనున్నారు. ఆపై జగన్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి, సత్కరించి, తిరిగి చెన్నై బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర మంత్రి, యానాం ముఖ్యమంత్రి మల్లాడి కృష్ణారావు విజయవాడకు చేరుకున్నారు.

MK Stalin
Vijayawada
Jagan
Oath
Chevireddy Bhaskar Reddy
  • Loading...

More Telugu News