Narendra Modi: కేంద్ర మంత్రులుగా వీరు ఖరారు... ఫోన్ చేసిన పీఎంఓ!

  • నేడు భారత ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
  • రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న మోదీ
  • పలువురికి ఫోన్ చేసిన పీఎంఓ

మరికొన్ని గంటల్లో ఇండియాకు రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ కేబినెట్ లో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయన్న విషయంలో కొంత సస్పెన్స్ తీరిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పలువురికి ఫోన్లు వెళ్లాయి. దాదాపు 40 మందితో మోదీ కేబినెట్ ఏర్పడుతుందని తెలుస్తుండగా, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌, రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్, గజేంద్ర షెకావత్‌ తదితరులకు పీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఎవరికి ఏ శాఖలు కేటాయించాలన్న విషయంలో మోదీ ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చారని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పలుమార్లు భేటీ అయి, పోర్ట్ పోలియోలపై నిర్ణయానికి వచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

Narendra Modi
Oath
Central Ministers
PMO
Phone
  • Loading...

More Telugu News