Jagan: బ్రేకింగ్... జగన్ ను కలిసేందుకు గంటా, అచ్చెన్నాయుడు, పయ్యావుల రెడీ.. అపాయింట్ మెంట్ కోరిన టీడీపీ నేతలు!

  • నేడు వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం
  • హాజరు కారాదని నిర్ణయించుకున్న చంద్రబాబు
  • ప్రతినిధులుగా ముగ్గురి ఎంపిక

మరికొన్ని గంటల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ, అంతకన్నా ముందుగానే ఆయన్ను కలవాలని మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ లను చంద్రబాబు పంపించారు. కొద్దిసేపటి క్రితం వీరు ముగ్గురూ జగన్ వద్దకు బయలుదేరారు.

జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కాకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, తన తరఫున ముగ్గురు ప్రతినిధులను పంపాలని ఆయన నిర్ణయించుకున్నారని, అది కూడా స్టేడియం వద్దకు కాకుండా, విడిగా కలిసి అభినందనలు తెలియజెప్పాలని భావించిన చంద్రబాబు, అందుబాటులో ఉన్న వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కాగా, తమకు ఉదయం 11 గంటల్లోపు జగన్ అపాయింట్ మెంట్ కావాలని వీరు కోరినట్టు తెలుస్తోంది. ఇంకా అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

Jagan
Oath
Chandrababu
Ganta Srinivasa Rao
Kinjarapu Acchamnaidu
Payyavula Keshav
  • Loading...

More Telugu News