Gurgaon: ఉద్యోగంలోంచి తీసేశారని బిల్డింగ్ పైకి ఎక్కి హడలగొట్టిన యువతి

  • గుర్గావ్ లో ఘటన
  • దిగొచ్చిన యాజమాన్యం
  • మళ్లీ విధుల్లోకి తీసుకున్న వైనం

హర్యానాలోని గుర్ గావ్ లో ఓ యువతి ఉద్యోగం కోసం బిల్డింగ్ పైకి ఎక్కి హంగామా సృష్టించింది. ఇక్కడి సైబర్ సిటీలో ఉన్న ఓ ప్రయివేట్ కన్సల్టెన్సీలో సదరు యువతి పనిచేస్తోంది. అయితే, ఉన్నట్టుండి ఆమెను సంస్థ యాజమాన్యం ఉద్యోగంలోంచి తొలగించింది. ఈ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన యువతి నేరుగా బిల్డింగ్ పైభాగానికి చేరుకుని అక్కడ్నించి దూకేస్తానని బెదిరించింది. అది ఐదంతస్తుల భవనం. అయినా సరే భయపడకుండా పిట్టగోడ అంచులపై నిలుచుని తనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోకపోతే చనిపోతానని యాజమాన్యాన్ని హెచ్చరించింది.

ఆమె సహచర ఉద్యోగులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. ఇంతలో పోలీసులు ఆ యువతిని సమీపించే ప్రయత్నం చేయగా, చేతికి అందినవి వారిపై విసరడం మొదలుపెట్టింది. చివరికి యాజమాన్యం దిగొచ్చి, ఆమెను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేయడంతో యువతి కిందికి దిగింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన బాగా వైరల్ అవుతోంది.

Gurgaon
Woman
  • Error fetching data: Network response was not ok

More Telugu News