Andhra Pradesh: రేపు జగన్ ఇంటికి వెళ్లనున్న పయ్యావుల, గంటా, అచ్చెన్నాయుడు!

  • జగన్ కు శుభాకాంక్షలు తెలపనున్న టీడీపీ బృందం
  • సభావేదిక వద్దకు వెళ్లరాదని నిర్ణయం
  • ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకారం

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లరాదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తనకు బదులుగా పార్టీ ప్రతినిధుల బృందాన్ని పంపాలని బాబు నిర్ణయించారు. తాజాగా ఈ బృందంలోని సభ్యుల పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు బృందాన్ని పంపాలని చంద్రబాబు నిర్ణయించారు.

రేపు ఉదయాన్నే ఈ బృందం తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు చెబుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రమాణస్వీకార వేదిక వద్దకు టీడీపీ బృందం వెళ్లరాదని పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Andhra Pradesh
Jagan
YSRCP
Ganta Srinivasa Rao
achennaidu
payyavula
  • Loading...

More Telugu News