KCR: కేసీఆర్, కేటీఆర్ లను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు!: మల్లు భట్టి విక్రమార్క

  • లోక్ సభ ఫలితాలతో టీఆర్ఎస్ పనైపోయింది
  • 2024లోనూ ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారు
  • గాంధీభవన్ లో మీడియాతో కాంగ్రెస్ నేత

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించారని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన కేసీఆర్, టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ పని అయిపోయిందని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్, కేసీఆర్ లు చేపడుతున్న పార్టీ ఫిరాయింపులను ప్రజలు అసహ్యించుకుంటున్నారనీ, అందుకు లోక్ సభ ఫలితాలే నిదర్శనమని తేల్చిచెప్పారు. కేసీఆర్ ఒంటెత్తు పోకడలకు 2024లోనూ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

KCR
KTR
TRS
Congress
Mallu Bhatti Vikramarka
  • Loading...

More Telugu News